కొత్త జిల్లాలకు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరిగే పరిణామాలు !

కేంద్ర ప్రభుత్వం కొత్త జిల్లాలపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా రాష్ట్ర గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది.

☛ అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగులను ఉమ్మడి జిల్లా మరియు విడిపోయిన జిల్లాల మధ్య పోస్టుల వారీగా విభజించడం జరుగుతుంది.

☛ ఇకపై ఉద్యోగ నియామకాలు పూర్తిగా జిల్లా వారీగా నిర్వహించబడతాయి.

☛ ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయిన జిల్లాలకు ఉపాధ్యాయ సిబ్బందిని సబ్జెక్టు వారీగా పోస్టుల కేటాయింపుతో విభజిస్తారు.

☛ ఉదాహరణకు, కడప జిల్లా నుంచి అన్నమయ్య జిల్లా విడిపోయిన సందర్భంలో, అన్నమయ్య జిల్లాలో ఎంతమంది పోస్టులు ఉండాలి, కడప జిల్లాలో ఎంతమంది పోస్టులు ఉండాలన్నది నిర్ణయించి విభజిస్తారు.

☛ ఉపాధ్యాయులు తాము ఏ జిల్లాలో పనిచేయాలనుకుంటున్నారో ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం కల్పించి, ఆప్షన్ ఆధారంగా ఆయా జిల్లాలకు బదిలీలు చేస్తారు.

☛ అవసరమైన మేరకు ఆప్షన్లు రాకపోతే, తక్కువ సీనియార్టీ ఉన్న ఉపాధ్యాయులను విడిపోయిన జిల్లాకు బదిలీగా పంపిస్తారు.

☛ పోస్టులు లేని పరిస్థితిలో, ఆప్షన్ ఇచ్చినప్పటికీ దానికి ఉపయోగం ఉండదని గమనించాలి.

☛ ఒకసారి క్యాడర్ వారీగా జిల్లా పునర్విభజన పూర్తయ్యి, ఆప్షన్లు ఇచ్చిన తరువాత, ఆయా ఉద్యోగులు ఆ జిల్లాల పరిధిలోనే భవిష్యత్తులో బదిలీలు పొందాల్సి ఉంటుంది.

☛ ఉదాహరణకు, అన్నమయ్య జిల్లాలో ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నట్లయితే, కడప జిల్లా నుంచి కొంతమంది ఉపాధ్యాయులు ఆప్షన్ లేదా బదిలీ ద్వారా అన్నమయ్య జిల్లాకు వెళ్లాల్సి ఉంటుంది.

☛ పునర్విభజన తర్వాత ఉద్యోగులు తమకు కేటాయించిన జిల్లాను సొంత జిల్లాగా భావించి, ఆ జిల్లాలోనే భవిష్యత్తు బదిలీలకు అర్హులు అవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *