అనకాపల్లి స్థానిక దాసరి గడ్డ వీధిలో మినర్వా ఆధ్వర్యంలో నడుస్తున్న రవీంద్ర భారతి పాఠశాలలో స్కూల్ యాజమాన్యం ఈరోజు నిర్వహించిన వన్ స్టాప్ సెంటర్ అవగాహన సదస్సుకు పోలీస్ శాఖ స్థానిక వన్ స్టాప్ సెంటర్ ఎస్. ఐ పి. రాములమ్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దీనిలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు 6 నుంచి 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు స్థానిక వన్ స్టాప్ నిర్వహిస్తున్న టెంపరరీ షెల్టర్, సైకో సోషల్ కౌన్సిలింగ్, మెడికల్ హెల్ప్ , లీగల్ అడ్వైసింగ్, గుడ్ టచ్ బ్యాక్ టచ్, సైబర్ క్రైమ్, పోక్సో, యాంటీ డ్రగ్స్ వంటి వివిధ అంశాలను కూలంకుషంగా విద్యార్థులతో చర్చించి వాటిపై ఏ విధంగా స్పందించాలో, పోలీస్ శాఖ సహాయ సహకారాలు ఏ విధంగా పొందాలో విద్యార్థులకు సవివరంగా తెలియజేశారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ నాగజ్యోతి , వన్ స్టాప్ సిబ్బంది సరస్వతి ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు
