లోక్ అదాలత్ లో సమస్యలకు సత్వర పరిష్కారం

అనకాపల్లి SR24 News :లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని కక్షిదారులు తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని పదో అదనపు జిల్లా జడ్జ్ నరేష్ పేర్కొన్నారు. నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని అనకాపల్లి కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుకోకుండా ఎదురైన ఆర్థిక మరియు ఇతర గొడవలతో కేసులు పెట్టుకుని కాలంతో పాటు ఆర్థికంగా నష్టపోకూడదని వివరించారు. కోర్టు చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోకుండా లోక్ అదాలతో సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కక్షిధార్ల ప్రయోజనార్థం సుప్రీంకోర్టు ఈ అదాలత్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సబ్ కోర్ట్ జడ్జ్ నాగేశ్వరావు , అడిషనల్ సబ్ కోర్ట్ జడ్జ్ రామకృష్ణ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్ట్ జడ్జ్ ధర్మారావు, మొదటి అదనపు తరగతి సివిల్ జడ్జ్ రమేష్, రెండో అదనపు తరగతి సివిల్ జడ్జ్ విజయలక్ష్మి, మూడో అదనపు తరగతి జడ్జ్ నికిత , బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిల్లా హర శ్రీనివాసరావు, సెక్రటరీ బంధం రమణ, ఉపాధ్యక్షులు సుంకర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *