ఐపీఎస్ అధికారి సిద్దార్థ్ కౌశల్ రాజీనామా చేశారు. స్వచ్ఛందంగా ఐపీఎస్కు రాజీనామా చేస్తున్నట్లు సిద్ధార్థ్ ప్రకటించారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు ఆయన వెల్లడించారు. తన రాజీనామాకు ఎలాంటి బలవంతం, వేధింపులు లేవని లేఖలో పేర్కొన్నారు.
