ఏపీలో వాట్సాప్ లో మొదలైన రేషన్ కార్డు సేవలు అమరావతి :
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతుండటంతో సర్వర్లు బిజీగా మారాయి దీంతో ప్రభుత్వం వాట్సాప్‌లో రేషన్ కార్డు సేవలను అందుబాటులోకి తెచ్చింది 9552300009 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేయడం ద్వారా పలు సేవలు పొందవచ్చు. మనమిత్ర ద్వారా రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు అయితే కొత్త రేషన్ కార్డు కోసం మాత్రం సచివాలయానికి వెళ్లాల్సిందే. ఈ సేవలు శనివారం నుంచి అందుబాటులోకి వచ్చాయి ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ లో ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చాయి.9552300009 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేస్తే ‘సేవను ఎంచుకోండి’ అనే ఆప్షన్ వస్తుంది.ఆ తర్వాత పౌర సేవలు, సివిల్ సప్లయిస్ సేవలపై క్లిక్ చేయాలి.అప్పుడు దీపం స్థితి, రైస్ డ్రా,eKYC,రైస్ కార్డు సమర్పణ, ఆధార్ సీడింగ్, కార్డు విభజన తదితర 8 సేవలు కనిపిస్తాయి.ఇవాళో,రేపో కొత్త రైస్ కార్డ కు దరఖాస్తు చేసుకునే ఆప్షన్ కూడా రానుంది