కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, శివపురం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో సాయంత్రం సమయంలో ఒక అరుదైన దృశ్యం అపురూప దృశ్యంగా చెప్పొచ్చు. గృహప్రవేశ సమయంలో ఆకాశంలో చంద్రబాబు నాయుడు ఇంటి చుట్టూ వివిధ రంగులతో వలయాకారంలో ఇంద్రధనస్సు కనపడడం శుభసూచకం గా నారా వారు భావిస్తున్నా
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గృహప్రవేశ కార్యక్రమం వేడుకగా జరిగింది. నూతనంగా నిర్మించిన ఇంట్లోకి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు వెళ్లారు. ఈ కార్యక్రమంలో లోకేశ్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం 5 గంటలకు పాలు పొంగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గృహప్రవేశానికి హాజరయ్యారు.రాత్రికి నూతన గృహంలోనే చంద్రబాబు బస చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శివపురం, పీఈఎస్ వెద్య కళాశాలతో పాటు వి.కోట -కుప్పం జాతీయ రహదారిలో బలగాలను మోహరించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాలను మళ్లించారు. కుప్పంలో సొంతిల్లు కట్టుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు. ఈ గృహప్రవేశం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రజల మధ్య జరిగిన శుభకార్యం తనకు ఎప్పటికి గుర్తుండిపోతుందని తెలిపారు.